డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
బీసీ బిల్లు ఏమైంది కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న దుండ్ర కుమారస్వామి
చట్టసభలలో 33% రిజర్వేషన్లతో మహిళా బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టడం స్వాగతించదగినదని, అయితే ఓబీసీ కోట లేకుంటే అన్యాయమేనని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు
దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఏమైందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కేంద్రాన్ని ప్రశ్నించారు
మంగళవారం నాడు లోక్
సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును బీసీ వర్గాల నుండి మిశ్రమ స్పందన లభించింది.ఈ నేపథ్యంలో భాగంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియు బీసీ మహిళా సంఘం సమైక్య రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.
ఎం దీపిక యాదవ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. వివిధ రంగాలకు చెందిన మహిళ ప్రతినిధులు డాక్టర్ సుచిత్ర దేవి ,డాక్టర్ సుల్తానా బేగం, పవిత్ర ముదిరాజ్ సింధూర ,రమ నరసింహ ప్రొఫెసర్ రేఖ, ప్రొఫెసర్ మధు లత తదితరులు పాల్గొని ప్రసంగించారు.డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
ముఖ్యఅతిథిగా దుండ్ర కుమారస్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ దేశంలో మెజార్టీలైన బీసీలకు ప్రజా ప్రాతినిధ్య సభలలో అవకాశం కల్పించడం, ప్రజాస్వామ్యతమైనదన్నారు. కాగా లోక్ సభలోభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు వాటా ఎంతో తేల్చాలని ఆయన కోరారు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాలలో భాగంగా బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పనతో ప్రధాని మోడీ కానుకగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఈ వర్గాల చిరకాల డిమాండ్ అని అన్నారు. ఏళ్ల తరబడిగా ఈ విజ్ఞప్తిని మన్నించకపోవడం దురదృష్టకరమన్నారు .ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా బీసీ బిల్లు కోసం పోరాడుతున్నామని అయినా కేంద్రం స్పందించకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. బీజేపీ వైఖరి బీసీ బిల్లుకు వ్యతిరేకమని తెలిపారు. పవిత్ర ముదిరాజ్ ప్రసంగిస్తూ బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం బాధాకరం అని అన్నారు. జనాభాలో మెజార్టీ లైన బీసీల డిమాండ్లు పక్కన పెట్టడం విచారకరమన్నారు. డాక్టర్ సుచిత్ర సింధుజలు మాట్లాడుతూ బీసీ వర్గాల నుండి ఎదిగిన నరేంద్ర మోడీ ఈ వర్గాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. రమా నరసింహ, సుల్తానా బేగం ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్లు అన్ని వర్గాల మహిళలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించేలా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కల్పించడం ఆహ్వానించదగినది కాగా ఓబీసీలకు రిజర్వేషన్ల ప్రస్తావన బిల్లులో లేకపోవడం సమంజసం కాదన్నారు.