దేశవ్యాప్తంగా విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జ్యోతి విద్యాలయ హై స్కూల్ సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ బ్రాంచ్ విద్యార్థులు సిబిఎస్ సిలబస్ టెన్త్ ఫలితాల్లో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అనుభజ్ఞులైన ఉపాధ్యాయ బృందo, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు అంకితభావం, ఏకాగ్రత తో చదివి తమ లక్ష్యాన్ని చేరుకున్నారు.ఎప్పటి లాగే పదోతరగతి ఫలితాల్లో తమకు తామే సాటి, తమకు ఎవరు పోటీ కాదని నిరూపించారు. సుదీర్ఘమైన ప్లే గ్రౌండ్, ఆహ్లాదకరమైన వాతావరణo లో ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అందుకు దోహద పడిన ఉపాధ్యాయ బృందాన్నీ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ అభినందించారు. ముందు ముందు ఇదే విధమైన స్పూర్తితో ముందుకు వెళ్లి, స్కూల్ కు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more