Prees
సమాజ ప్రగతిలో స్త్రీల పాత్ర కీలకం- డాక్టర్ వకులాభరణం
మన దేశ మహిళలు నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తున్నారు. ఇది ఒక శుభ ఆరంభం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వగలాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
అయితే మన దేశ చట్టాలలో ఉన్న లోపాలు స్త్రీ జాతి మనుగడకు అవరోధంగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజ ప్రగతికి మూలస్తంభంగా నిలిచే స్త్రీ రాజకీయ రంగంలో ఎందుచేత దామాషా మేరకు తమ వాటాను సాధించుకోలేకపోతున్నారు, సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్రంలోని పాలకులపై ఉంది అన్నారు .చట్ట సభలలో ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉండడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది.
తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రధాన వేదికలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తారలు దిగివచ్చిన వేళ అన్నట్లుగా అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించబడ్డాయి. అన్ని రంగాలకు చెందిన మహిళా ప్రముఖులతో ప్రాంగణమంతా కలకలలాడింది.
ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు సినీ తారలు వివిధ సామాజిక కార్యకర్తలకు, మహిళా శిరోమణి మహిళా శక్తి మొదలగు పురస్కారాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. సత్కారం పొందిన ప్రముఖులలో శంకరాభరణం సేమ్ సినీనటి మంచు భార్గవి, ప్రముఖ సినీ తారలు దివ్యవాణి వై విజయ రాగిణి, ప్రీతినిగం, ఢిల్లీ రాజేశ్వరి, రోజా రమణి, నృత్య గురువులు స్వాతి సోమనాథ్ ప్రసన్న కుమారి, రమణి అరుణ్ బక్షి ,వనజ ఉదయ్, సినీ నేపద్య గాయని విజయలక్ష్మి విద్యాసంస్థల డైరెక్టర్లు, రమాదేవి (భారతీయ విద్యా భవన్ ప్రిన్సిపల్), ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – పల్లవి గ్రూప్స్ పాఠశాలలు డైరెక్టర్ సుధా, మెరీడియన్ పాఠశాలల డైరెక్టర్ ఉషా రెడ్డి, ఓబుల్ రెడ్డి ప్రిన్సిపల్ సిహెచ్ రేఖా రావు, డి ఏవి పాఠశాల డైరెక్టర్ సీతా కిరణ్, వివిధ రంగాలలో అత్యున్నత సేవలు అందించిన 30 మంది మహిళ ప్రతినిధులకు పురస్కారాలు అందజేయడం జరిగింది.. భారతీయత సాంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్యం కామా పేరుని ఒకే రూపకాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి.