శేరిలింగంపల్లి : సంగారెడ్డి జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ 2022 పోటీలు బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలో టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ క్రీడాకారులు సత్తా చాటి మొదటి స్థానంలో నిలిచి మెడల్స్ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా టైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ మరియు సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సతీష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ ఏ ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ లు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఈ పోటీలు పివి నాలుగు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల మధ్య వయసుగల క్రీడాకారులు, సబ్ జూనియర్ 8 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య వయసుగల క్రీడాకారులు, క్యాడేట్ 13 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు, జూనియర్స్ 14 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్య వయసు గలది క్రీడాకారులు, సీనియర్స్ 17 సంవత్సరాల పైన వయసు గల క్రీడాకారులు జిల్లా వ్యాప్తంగా 150 నుండి 200 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ ఛాంపియన్ షిప్ పోటీలో మొదటి స్థానంలో. బి హెచ్ ఈ ఎల్ లోని టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ క్రీడాకారులు నిలువగా, రెండో స్థానంలో చందానగర్ పీజేఆర్ స్టేడియం క్రీడాకారులు, మూడో స్థానంలో మార్టిన్ మణికంఠ టీంలు పథకాలు సాధించాయి.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more