నియోజకవర్గంలోనిమియాపూర్ డివిజన్ పరిధిలో నడిగడ్డ తండాలో గత 40 సంవత్సరాల నుండి దాదాపు 800 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన వర్గాల పేద ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నారు 2016 సంవత్సరంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఈ భూమి మాది అని నడిగడ్డ తండా ముందు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకుని పాత ఇండ్లను కూడా పునర్నిర్మాణం చేయనీయకుండా అడ్డుకోవడం జరుగుతుంది.ఈ మధ్యలో కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గతంలో నిర్మించుకున్న పాత ఇండ్లు కూలిపోవడం జరిగిందని,. తిరిగి నిర్మాణం చేపడుదాం అంటే ముడి సామాగ్రిని కూడా తాండా లోపలికి రానివ్వకుండా అడ్డుకొని సీఆర్పీఎఫ్ బెటాలియన్ వాళ్లు కూల్చివేయడం జరుగుతుందని తాండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇండ్లలో నీరు చేరి ఇండ్లు కూలిపోయి రాత్రి సమయంలో నిద్ర హారాలు మాని పేద ప్రజలు బాధపడుతుంటే తండావాసులు అందరూ కలసి భారీ ఎత్తున సిఆర్పిఎఫ్ క్యాంపు ముందు నిరసనకు దిగి పునర్నిర్మానం చేయుటకు ముడి సామాగ్రిని తండా లోపలికి అనుమతించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దశరత్ నాయక్ మాట్లాడుతూ మా నడిగడ్డ తండాను సి ఆర్ పి ఫ్ పరధి నుండి మినహాయించి మాకు పెర్మనెంట్ గా ఇండ్లు కట్టుకునే విధంగా అనుమతించాలని, అనేక మార్లు ప్రజాప్రతినిధుల, ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి మా సమస్యను గురించి వ్యక్తపరిచినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తపరుస్తూ మాకు సిఆర్పిఎఫ్ వాళ్ల నుంచి శాశ్వత పరిష్కారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ తిరుపతి రావు, సబ్ ఇన్స్పెక్టర్ రవి కిరణ్ లు స్వయంగా తాండకు వచ్చి సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి పర్యటించి వర్షాల కారణంతో కూలిపోయిన ఇండ్లను పునర్నిర్మానం చేయుటకు అనుమతించాలని, తండావాసుల తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సానుకూలంగా సిఆర్పిఎఫ్ సిబ్బంది స్పందించడం జరిగింది. ఇందుకు సహకరించినవారికి తండావాసులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండ గిరిజన సంక్షేమ సంఘంకమిటీ ప్రధాన కార్యదర్శి నాయిని రత్నకుమార్ సీతారాం నాయక్,మద్దిలేటి ముదిరాజ్, మోహన్ నాయక్, కృష్ణా నాయక్,డి నర్సింహా,రమేష్ యాదవ్, చందు యాదవ్,ఆంజనేయులుతేజావత్ బాలు నాయక్ బి వెంకటేష్, రతన్ నాయక్,ఈశ్వర్, సురేష్ నాయక్, జై మధు నాయక్, రాందాస్, హరిలాల్ నాయక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more