ఈ రోజు మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్తగా వ్యవహరించారని1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు . అంతేకాకుండా1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులై 1967లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ ఆ పదవిలోనే కొనసాగాలని తెలియజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణంతరము భారతీయ జనతా పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపథంలో పార్టీని నడిపించారు..అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానాన్ని ఎంచుకున్న ఉన్నతమైన వ్యక్తి చివరకు1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగులు గౌడ్, జంగయ్య యాదవ్, శ్రీశైలం కురుమ, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ, ఆనంద్, లక్ష్మణ్, గణేష్ ,నరేష్, కొండయ్య యాదవ్, రాము. స్వప్న, రమేష్ నాయక్, కురుమయ్య ,ఆంజనేయులు మొదలగువారు పాల్గొన్నారు
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన దుండ్ర కుమారస్వామి
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్,శేర్లింగంపల్లి జోనల్...
Read more