శిల్పారామం లో నిర్వహిస్తున్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో కి మహిళలనుండి మంచి స్పందన వస్తుంది.వివిధ రాష్ట్రాలనుండి వేంకటగిరి, బనారసీ, బెంగాలీ, జాంధానీ, కలంకారీ, బెంగళూరు సిల్క్, పైతాని, టుస్సార్, మొదలైన చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. శిల్పారామం మహిళా సిబ్బంది బతుకమ్మ ను పేర్చి మెయిన్ లాన్ లో ఆదుకున్నారు.సందర్శకులు కూడా పాల్గొన్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా,చావలి బాల త్రిపురసుందరి శిష్య బృందం చే “దేవి స్మరణం” కూచిపూడి నాట్యం లో అమ్మవారి కీర్తనలను ప్రదర్శించారు.గణపతి గీతం, మతే మలయధ్వజ, నటేష్ కౌతం, కామాక్షి స్తుతి,భావయామి రామ లింగేశ్వర,నీదు చరన, అమ్మ భ్రమరాంబ,అయిగిరినందిని , మంగళం అంశాలను శ్రీమతి శశికళ, శ్రీసౌమ్య, బిజినా,దీక్షితులు, వైష్ణవి, సర్వాణి, సంజన, అభిరాం, శ్రీరామ్, సహన, మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more