అల్లాపుర్ డివిజన్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అధ్వర్యంలో ఏమ్యేల్యే మాధవరం కృష్ణా రావు చేతులమీదుగా డిసి రవికుమార్, నోడల్ అధికారి ప్రభాకర్, సి ఓ ప్రసాద్,మురళి, కలిసి 1220 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డు లను, మరియు 106 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సదర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇటు ఆడబిడ్డలు నీటి కోసం ఇబ్బంది పడకూడదు అని ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవించిన తల్లికి కెసిఆర్ కిట్టు, అలాగే మరోవైపు ప్రతీ ఆడపిల్ల తల్లితండ్రులకు అండగా కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు, ఇప్పుడు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నగా, కొడుకుగా, ప్రతీ ఒక్కరికీ తోడు నీడగా ఆసరా పెన్షన్ లు కనీవిని ఎరుగని రీతిలో మంజూరు చేసి తోడులేని ఒంటరి మహిళలకు, వితంతువులకు, వృద్దులకు అండగా నేను ఉన్నాను అని ప్రతీ ఒక్కరికీ ఆసరాగా నిలిచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, అలాగే మనకు నిత్యం అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న ఎమ్మెల్యే కృష్ణా రావు కి మా హృదయ పూర్వక ధన్యవాదాలు, మరియు ప్రజల శ్రేయస్సు కొరకు వారి బాగోగుల కొరకు ఆలోచిస్తున్న ఇంత గొప్ప నాయకులు మనకి ఎప్పటికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, జనరల్ సెక్రటరీ పిల్లి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, నజ్మా, అనుబంధ కమిటీ అధ్యక్షులు, అన్ని బస్తీల సంక్షేమ సంఘం అధ్యక్షులు, బస్తి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, ఏరియా సభా సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more