గత కొన్ని రోజులుగా శేరిలింగంపల్లి 106 డివిజన్ రాజీవ్ గృహకల్పలో కనీసం త్రాగడానికి కూడా నీళ్లు రావడం లేదు అని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. వరుసగా రెండవ రోజు కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులూ జెరిపేటి జైపాల్ గారి సహకారంతో స్థానిక కాంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ జహంగీర్ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో ఉచిత మంచి నీళ్లను పంపిణి చేసారు. సమస్య తీవ్రం కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడి ప్రత్యనయ మార్గాల ద్వారా ఆదుకుంటున్నందుకు ప్రజలు *కాంగ్రెస్ పార్టీ* నాయకులకు ధన్యవాదములు తెలిపారు. సమస్యను పరిష్కరించక పోతే HMWDS కార్యాలయం ముందు ప్రజలతో కలిసి ధర్నాకి దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముకురం, యువజన కాంగ్రెస్ సూర్య రాథోడ్, రాజేష్, విద్యార్థి విభాంగం ప్రభు, అశోక్ పాల్గొన్నారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more