ESI సూపరింటెండెంట్ సుధాకర్ గారితో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాట్లు….
తన డివిజన్ లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు తన మంచి మనసును చాటుకున్నారు.
పటాన్చెరువులోని జెపి కాలనీ నివాసి పరమేష్ అనే వ్యక్తి వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్లకు చూపించగా శాస్త్రచికిత్స చేయాలని చెప్పడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన పరమేష్ ప్రైవేట్ ఆస్పత్రులలో ఆపరేషన్ చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ గత 15 రోజుల నుండి తిరిగినప్పటికీ ఆపరేషన్ జరగలేదు. ఈ విషయం కార్పొరేటర్ గారికి విన్నవించగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ గారు పరమేష్ తో కలిసి రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లి అక్కడ సూపరింటెండెంట్ గారిని కలిసి పరమేష్ సమస్యను తెలియజేశారు. వెంటనే తగిన ట్రీట్మెంట్ ప్రారంభించి అవసరమైతే ఆపరేషన్ చేయాల్సిందిగా కార్పొరేటర్ గారు సూపరింటెండెంట్ సుధాకర్ గారిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన సూపరింటెండెంట్ సుధాకర్ గారు అవసరమైన పరీక్షలు నిర్వహించి శాస్త్ర చికిత్స జరిగేలా చూస్తామన్నారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి నుండి సనత్ నగర్ లో గల సూపర్ స్పెషాలిటీ ఈఎస్ఐ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది.
ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే తనకు తెలియజేయాలని కార్పొరేటర్ గారు పరమేష్ కుటుంబానికి భరోసానిచ్చారు.