తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం అర్హులైన లబ్దిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పారదర్శకమైన ప్రక్రియ ద్వారా అప్పగించడం జరుగు తుందని తెలియపరుస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఇళ్లులేని నిరుపేదల కోసం సుమారు ఒక లక్షా డబుల్ బెడ్రూం ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని సొంతిళ్లు లేని నిరుపేదల కోసం 4400 ఇళ్లను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇట్టి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వ అధికారులు అర్హులైన వారిని ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టారు.
ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరి అర్హతను ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి నేరుగా పరిశీలించడం జరుగుతుంది. అట్టి సమయంలో దరఖాస్తుదారులు తమ వద్ద ఉన్న అన్ని అర్హత దృవీకరణ పత్రాలను అధికారులకు చూపించి సహకరించాల్సిందిగా కోరుతున్నాము, దరఖాస్తుదారులు చూపించిన అర్హత దృవీకరణ పత్రాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ఇళ్లులేని నిరుపేదలను అధికారులు ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన వారందరిలో మొదటి విడుతగా పారదర్శకంగా(నిజాయితీగా) లాటరీపద్దతి ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించడం జరుగుతుందని తెలియ పరుస్తున్నాము. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీఒక్కరికి తప్పకుండా విడతల వారీగా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించడం జరుగుతుందని తెలియపరుస్తున్నాము. మొద విడుతలో రాని వారికి రెండవ విడుతలో ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతీఒక్కరికి ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
ప్రధానంగా దరఖాస్తుదారులు ఎవరూ కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఒక్క రూపాయి కూడా చేయవద్దని తెలియజేస్తున్నాము. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పిస్తామని వచ్చే మధ్యవర్తులు, బ్రోకర్ వ మాటలు నమ్మి మోసపోవద్దని తెలియపరుస్తున్నాము. డబుల్బెడ్రూం ఇళ్లకోసం ఎవరికి డబ్బులు ఇవ్వ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కొందరు మోసకారుల మాయ మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన సంఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. కొందరు అమాయక ప్రజల వద్ద డబ్బులు తీసుకొని _మోసం చేసిన విషయం మా దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడంతో పాటు వారిని జైలుకు: పంపేలా చేయడం జరిగింది. కావున ఇళ్లు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు అడిగే వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా మా దృష్టికి తీసుకువస్తే వారిని పోలీసులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మున్సిపలాశాఖ మంత్రి వర్యులు కేటీఆర్ సహాయ సహకారాలతో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ అటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఇటూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని సగర్వంగా తెలియపరుస్తున్నాము. ఇళ్లులేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు విషయంలో ఏలాంటి అపోహాలు, అనుమానాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకమైన పద్ధతిలో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం జరుగుతుందని, ఎవరూ ఎవరికీ ఇళ్ల కోసం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మరో మారు తెలియపరుస్తూ మీరు కూడా మీ మీ కాలనీ లు, బస్తీలలోని ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లపై అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాము…కొంత మంది డబ్బులు తీసుకుని మీకు ఇల్లు కేటాయించాంఅని నకిలీ ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు అని తెలిపారు..అలాగే ఎవరైనా ఈ విషయం లో మోసం చేసిన యెడల తమ దృష్టికి తీసుకురావాలని కోరారు….అందుకు కింది నంబర్ కి ఫోన్ చేయాల్సింది గా కోరారు