కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అత్వలే
(ముంబై, హైదరాబాద్ జూలై 31, : రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని తల్కతోర స్టేడియంలో ఆగస్టు 2న సాయంత్రం నాలుగు గంటలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అర్పీఐ) స్వాతంత్ర్యం అమృత్ మహోత్సవం వేడుకలను నిర్వహిస్తొంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలు అమృత్ మహోత్సవను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరి హాజరుకానున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్వతంత్ర సువర్ణ మాసం, అజాదిక అమృత మాసం కార్యక్రమాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అత్వలే అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ వేడుకలలో పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు, దేశం నలుమూలల నుండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు కూడా హాజరుకానున్నారు. ఈ సంవత్సరం భారత స్వతంత్ర్య యొక్క 75వ వార్షికోత్సవం అనగా స్వతంత్య్రం అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాట్లు ముంబై లోని ఆర్పీఐ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. ఈ సంద్భంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్సెప్ట్ తో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆజాదికా అమృత్ మహాత్సవ్ జరుపుకుంటున్నారు. భారత స్వతంత్రం పోరాటంలో స్వతంత్ర సమరయోధులు అందించిన కృషికి కృతజ్ఞలతో కూడిన నివాళి. అజాధికా అమృత్ మహాత్సవం అని స్పష్టం చేశారు. స్వతంత్ర పోరాటం జ్ఞాపకాలను పునర్జీవింపజేయడానికి దేశభక్తిని మెల్కోల్పడానికి జరుపుకునే పండుగ అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవం ద్వారా. ఈ కార్యక్రమం ద్వారా భారత స్వతంత్రం పోరాటంలో ఎందరో వీరులు, గొప్ప స్వతంత్ర సమరయోధులు, భారత స్వతంత్ర పోరాట చరిత్ర ను కీర్తిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అత్వలే పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.