బీసీలకు కూడా రాష్ట్రపతి అవకాశము ఇవ్వండి:
బీసీలుగా పుట్టడమే పాపమా ? జనాభా గణనలో కులగణన బీసీలకు ప్రాణవాయువు?
ఈ దేశ చరిత్రలో ఊపిరి పోసుకున్న ఉద్యమాలు ఎన్నో ఎందరో జీవితాలకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. అయినా ఎక్కడో ఏదో వెలితి ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నలా కనిపిస్తూనే ఉంది. ఒక ఉద్యమం మొదలు అయ్యిందంటే దానివెనక ఎన్నో కారణాలు,బాధలు ఉంటాయన్నది విదితమే. ఇకపోతే అన్నిరంగాల్లో భారతదేశం దూసుకుపోతున్నదని గర్వించే మనం ఇప్పటికి కొన్ని వర్గాల వారికి సరైన గుర్తింపు లభించడం లేదన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. ముఖ్యంగా బీసీలుగా పుట్టడమే తాము చేసుకున్న పాపమా అని బాధపడే వారు ఎందరో ఉన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాల పై ప్రతి బిసి బిడ్డ ఉద్యమించాలి. ఈ క్రమంలో బీసీలు రాజ్యాధికారం సాధించే దిశలో ప్రయాణం చేస్తూ, పోరాటాలు చేయాలని, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ లక్ష్యం అనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతే కాకుండా కేంద్రం బీసీలకు మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వెల్లడించారు. అంతే కాకుండా బీసీ ఉద్యోగుల కి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా స్థానిక సంస్థలతో పాటుగా పంచాయతీరాజ్ సంస్థలలో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను 50 శాతం పెంచినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. అదీగాక రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలనీ, ఏ కులానికి లేని క్రిమిలేయర్ నిబద్ధతను, కేవలం బీసీల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై వర్తింపచేయడం అన్యాయమని పేర్కొంటూ బీసీలకు సామాజిక రక్షణ భద్రత కల్పించడానికి బీసీ అట్రాసిటీ చట్తం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించీ, బీసీ మహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇక ఇప్పటి వరకు బీసీ జనాభా గణనలో కులగణన చేయకపోవడం ద్వారా కొన్ని వేల సంవత్సరాలుగా కులవ్యవస్థ కుంటుబడిపోతుందని కాబట్టి వారి వారి కులం ఆధారంగా జనగణన చేసినప్పుడు మాత్రమే ఆయా కులాల విద్య సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. ఇవేవి చేయకుండా ప్రజా ప్రతినిధులు కల్లబొల్లి కబుర్లతో కాలం గడిపితే బీసీలకు ఎలా న్యాయం జరుగుతుంది అని ప్రశ్నించాడు.
బీసీలకు కూడా రాష్ట్రపతి అవకాశము ఇవ్వండి:
ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే, ఈ సందర్భంగా ఎన్డీఏ మరియు ఇతర అన్ని కూటములు తమ అభ్యర్థులుగా బీసీలను బరిలోకి దింపాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కోరారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రపతిలుగా అగ్రవర్ణ కులాలు, మైనారిటీలు ఎస్సీలకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈసారి బీసీలకు అవకాశం కల్పించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు..