తెలంగాణ రాష్ట్ర బి. సి. కమిషన్ ఈ నెల 25 నా బుధవారం నాడు కర్ణాటక లో పర్యటించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బి.సి. రిజర్వేషన్ ల శాతం స్థిరీకరణ, కుల వృత్తుల నవీకరణ, జీవన ప్రమాణాల మెరుగుదల కు తీకుకోవలసిన చర్యలు, చేయాల్సిన సిఫార్సుల నిమిత్తం అధ్యయనం కొనసాగించనుంది. చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు సారధ్యం లో సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, శుభప్రధ్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్ ల బృందం కర్ణాటక బి.సి. కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే ఇతర సభ్యుల తో ప్రత్యేకంగా సమావేశం కానుంది. గతంలో కర్ణాటక బి.సి. కమిషన్ లు చేపట్టిన కుల గణన వివరాలను, అవలంభించిన పద్ధతులను, విధి విధానాలను కూలంకశంగా చర్చించనున్నది. ఇందుకు సంబంధించిన సమాచార సేకరణ ను కూడా చేస్తుంది. ఈ సమావేశం నెo. 16- డి, 2 వ అంతస్తు, డి. దేవరాజ్ ఆర్స్ భవన్, మిల్లర్స్ ట్యాంక్ బెడ్ ఏరియా, వసంత్ నగర్, బెంగళూరు లో గల కర్ణాటక బి.సి. కమిషన్ కార్యాలయం లో జరగనున్నది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more