ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ దిడ్డి సుధాకర్ కు పలువురు సన్మానం
ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాగత నిర్మాణ శిక్షణ విభాగం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన డాక్టర్ దిడ్డి సుధాకర్ కు వివిధ రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్, హిమాయత్ నగర్, అమృత ఎస్టేట్స్, ఐపిసో భవన్ లో జరిగిన కార్యక్రమంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్యెల్సీ కె. యాదవ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏమార్గీ వినోద్ రెడ్డి, విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులూ తిప్పర్తి యాదయ్య, ప్రముఖ సినీ నటి ప్రీతీ నిగమ్, కాచం ఫౌండేషన్ చైర్మన్ కాచం సత్యనారాయణ, ఐపిసో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ తదితరులు శాలువా, పుష్పగుచ్చాలు, ఫూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాగత నిర్మాణ శిక్షణ విభాగం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్, దక్షణాది రాష్ట్రాల ఇంచార్జి, ఎమ్యెల్యే సోమనాథ్ భారతి కి AAP TS search committee chairperson Indira Shoban ku హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి పార్టీని ప్రజలకు చేరువైయే విధంగాను పని చేస్తానని, తెలంగాణ రాష్ట్రం లో పార్టీ నిర్మాణం కొరకు కృషి చేస్తానని తెలిపారు.