ట్విటర్‌ను 3 లక్షల 34 వేల కోట్లకు దక్కించుకున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. ఇంతకుముందు ట్విటర్‌లో 9% వాటా కొనుగోలు చేశాడు మస్క్. ఆ తరువాత ఒక్కో షేర్‌కు 54 డాలర్లు గా మొత్తం 100 శాతం వాటానూ అంటే సుమారు 44 బిలియన్ డాలర్లకు కొన్నాడు. ఇప్పుడు ట్విటర్ సీఈవోగా ఒక ఇండియన్ అయిన పరాగ్ అగర్వాల్ ఉన్నారు. టెస్లా డీల్ చాలా బాగా నచ్చిందని ఆయన తెలిపారు.
అయితే తన హయాంలో ఇప్పుడు ట్విటర్‌కు ఇంకా వాక్ స్వాతంత్రం వస్తుందని ఇంతకుముందు ఎలన్ మస్క్ తెలిపారు. ఇప్పుడు ట్విటర్‌లో పూర్తి వాటా తీసుకున్న తర్వాత మాట మార్చారు. తాను అనుకున్నట్లుగా ట్విటర్‌లో వాక్ స్వేచ్ఛను పెంచడం కుదరదని, ఇంకా కొత్తగా ఎలాంటి స్వేచ్ఛనూ కల్పించలేమన్న విషయం తనకు పూర్తి వాటా కొన్న తరువాత అర్థమయిందని చెప్పుకొచ్చాడు.