ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని డిమాండ్.
బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలి అని బీసీ దల్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలియజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ యువతరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 80 వేల ఉద్యోగాలను ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. నిర్దిష్టమైన ఉద్యోగ ఉపాధి పాలసీలను కూడా ప్రకటించవలసి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని తెలియజేశాడు.
ఈ నేపథ్యంలో భాగంగా బిసి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని తెలియ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన మరియు ప్రైవేట్ శిక్షణకు పొందలేని బీసీలకు మరియు సరిగ్గా పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారు ఈ కోచింగ్ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉపయోగపడతాయని , మరియు వారిలో ప్రావీణ్యత పెంచడానికి ఉపయోగ పడుతుందని అని, వెంటనే కోచింగ్ సెంటర్ లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క బహుజన బిడ్డ దీన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా ఇంజనీరింగ్, మెడిసిన్,పీజీ ,డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులు చదివే బిసి విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.