అఖిల్ చేసిన సినిమాల్లో ఆయన్ని ఇంతవరకూ లవర్ బాయ్‌గానే చూపించారు. కానీ ఇప్పుడు వస్తున్న ఏజెంట్ మూవీలో అఖిల్ ని యాక్షన్ హీరోగా చూడబోతున్నాం. సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సరికొత్త మేకోవర్‌లో కనిపించబోయే అఖిల్ ఈ సినిమా గురించి చాలా హార్డ్‌వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు అజెంట్ మూవీ ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో అఖిల్ కండలు పెంచిన బాడీతో సర్ప్రైస్ ఇస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కి సంబందించి కొంత పార్ట్‌ని మెట్రో ట్రైన్లో రూపొందించారు. దీనికి సంబందించిన ఫోటో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. అందులో సహాయకులు అఖిల్ కు ఏదో సన్నివేశం వివరిస్తున్నట్లు ఉంది.