ఇండియా నుంచి దోహాకు వెళ్ళే ఖతార్ ఎయిర్‌వేస్ క్యూఆర్-579 విమానాన్ని ఎమర్జెన్సీగా పాకిస్తాన్‌లో ల్యాండ్ చేశారు. ఖతార్ ఎయిర్‌వేస్ క్యూఆర్-579 విమానం లో పొగలు రావడంతో కరాచీ ఇంటర్నేష్నల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
సోమవారం ఉదయం 3.20 గం.లకు విమానం డిల్లీ నుండి స్టార్ట్ అయింది. అదే రోజు ఉదయం 5.30 కి కరాచీలో ల్యాండ్ అయింది. విమానం కార్గో విభాగం నుంచి పొగలు రావడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీలో సేఫ్ ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఉన్న 283 మందిని మరో ప్రత్యేక ఫ్లైట్ లో దోహాకి తీసుకెళ్ళారు.
ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వలన ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సిబ్బంది తెలిపారు. ఖతార్ ఎయిర్‌వేస్ దీనికి సంబందించి కారణాలు వెంటనే చెప్పలేమనీ, దినిపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు.