ఈరోజు శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. క్రికెట్ అభిమానులకు ఇది అంత పెద్ద ఆసక్తికరమైన విషయం కాదు. ఎందుకంటే భారత్ తో శ్రీలంక 44 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 20 మ్యాచులు ఇండియానే గెలిచింది. 17 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఏడు టెస్టులో శ్రీలంక గెలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలంక పర్ఫార్మెన్స్ ను చూస్తే పేలవంగా ఉంది. మ్యాచ్ ఏకపక్షం గానే ఉంటుందని తేలిపోతుంది. కానీ ఈ రోజు మ్యాచ్ ను ఆసక్తికరంగా చూడడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
- విరాట్ కోహ్లీకి ఇది ఇది వందో టెస్ట్ మ్యాచ్. దీంట్లో ఇంతకుముందు లాగా దుమ్ము రేపే ప్రతిభను కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే అతను ఇంకా 38 పరుగులు చేస్తే, టెస్టుల్లో 8000 మైలురాయిని దాటుతాడు.
- వన్డే మ్యాచులు కెప్టెన్ గాచేసిన అనుభవం ఉన్న రోహిత్ శర్మ , ఇప్పుడు మొట్టమొదటిసారిగా టెస్టు మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
- ఈ మధ్య కాలం లో ఆడిన మ్యాచ్ లలో మిడిలార్డర్ హీరోస్ పుజారా, రహానెల్లో ఎవరూ లేకుండా భారత్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే.