ప్రముఖ ప్రవచనకర్త, అవధానములో సిద్ధహస్తులు గరికపాటి నరసింహారావుగారు పుష్ప మూవీ పై అనేక అభ్యంతరాలను వెలిబుచ్చారు.
ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతూ పుష్ప సినిమా పై అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసే వ్యక్తులను, దుర్మార్గులను, స్మగ్లర్లను హీరోగా ఎలా చూపిస్తారు అని అడిగారు.
సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివరి ఐదు నిమిషాల్లో మంచి చూపిస్తే జరగాల్సిన తప్పు జరిగింది జరిగిపోతుందని అన్నారు. దీన్ని చూసి చెడు విషయాలను కొనసాగించడం అందరూ హీరోయిజంగా భావిస్తారని చెప్పారు. “తగ్గేదేలే” అనే డైలాగ్ స్మగ్లర్లు చెప్పేదికాదు. శ్రీరాముడు,హరిశ్చంద్రుడు లాంటి వారు చెప్పాలి. చిన్న పిల్లలు కూడా తప్పు చేసి తగ్గేదేలే అని చెబుతున్నారు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి అని వాపోయారు.
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన దుండ్ర కుమారస్వామి
ఐఏఎస్ అధికారులతో కలిసి సమగ్ర కుల సర్వేను పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కుల సర్వేను పరిశీలించిన ఐఏఎస్ మయాంక్ మిట్టల్,శేర్లింగంపల్లి జోనల్...
Read more