ప్రజల్లో కరోనా మరియు ఒమిక్రాన్ వైరస్ లను ఎదుర్కోవడం కోసం పాట రూపం లో అవగాహన మరియు చైతన్యం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ మరియు జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రయత్నం.- పాల్గొన్న హోమ్ సెక్రటరీ చంపలల్l మరియు ప్రముఖ సింగర్ మనో.
భారతదేశంలో బుసలు కొడుతున్న కరొన మరియు ఒమిక్రాన్ అనే వైరస్ థర్డ్ వేవ్ మొదలైన పరిస్థితి మన అందరికి తెలిసిందే. మొదటి వేవ్ లో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితిని, మహమ్మారి ప్రభావాలను అధిగమించడానికి విధించిన లాక్ డౌన్, భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పడిన ప్రభావం చూసాము. , రెండో వేవ్ ని కూడ మనం ఎదుర్కొన్నాము, మూడో వేవ్ ను కూడా ప్రస్తుతం ఎదుర్కొంటూ కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మన ప్రాణాలు మనం కాపాడుకుందాం, కరోనా కు ప్రాణం విలువ తెలియదు, కానీ మన కుటుంబానికి ప్రాణం విలువ తెలుస్తుంది.
కరోన మరియు ఒమిక్రాన్ వైరస్ విరుచుకుపడుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలలో దానిపై పూర్తిగా చైతన్యం తీసుకురావడానికి మరియు మనం పాటించవలసిన కనీస ఆరోగ్య సూత్రాలను అవగాహన కల్పించడం అనే నేపద్యం లో భాగంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు ముందుకు వచ్చి ఒక ఒక పాట ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి బాగుంటుందని భావించి, తన మిత్రుడు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఘంటాడి కృష్ణ మరియు జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి వారిరువురు ఒక ప్రత్యేకమైన పాటను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా ఈ పాట వచ్చింది అని తెలియజేశారు. “మళ్లీ వచ్చిందేందిరో మాయదారి మహమ్మారి” అనే పాట నిర్మాతగా కుమారస్వామి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రణయ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ కృష్ణ గానంతో ఇది ప్రజలకు అవగాహన, వారి శ్రేయస్సు కోసం ప్రజల కోసం, ప్రజలకే అంకితం ఈ పాట అని బిసి దళ్ అధ్యక్షుడు తెలియజేశారు .
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి మాట్లాడుతూ గడిచిపోయిన కాలంలో మనం మన ఆత్మీయులను కోల్పోయాం బంధువులను కోల్పోయాం
ఈ కష్టం మనల్ని సమూలంగా నాశనం చేయాలని వచ్చింది మనం అందరం అప్రమత్తంగా ఉందాం ఈ కరోనా కోరలు పీకి దానిని అంతం చేద్దాం, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను హరించి వేసింది అయినవాళ్లకు దూరం చేసింది తగ్గు ముఖం పటింది అన్న అపోహలో మనల్ని పడేసి ఇప్పుడు మల్లి విలయతాండవం చేస్తుంది జాగ్రత్త మిత్రులారా అప్రమత్తంగా లేకున్నారో ఈ కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంటావ్ అని తెలియ చేశాడు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, జాగ్రత్త వహిద్దాం జాగృతం చేద్దాం, దూరం దూరంగా ఉందాం కరోనా తరిమేద్దాం, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుందాం. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు వేసుకుందాం కరోనా – ఒమిక్రాన్ లను ఎదుర్కొందాం.
ఈ పాటను తెలంగాణ రాష్ట్ర హోం సెక్రటరీ చంపాలాల్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ సింగర్ మను పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఘంటాడి కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ మరియు రాజీవ్, రవి ఇతరులు పాల్గొన్నారు.