తెలంగాణ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండలని సి.ఎం. కె.సి.ఆర్. చెప్పారు. సంక్రాంతి పండగను గుంపులుగా కాకుండా అందరూ ఇల్లలోనే ఉండి జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుండి బూస్టర్ డోసు ప్రారంభం కానుంది.
అసలు బూస్టర్ డోసు అంటే ఏమిటి?
ఏదైనా ఒక టీకా తీసుకున్న తర్వాత వ్యాధి నుంచి ప్రొటెక్షన్ ను మరింత పెంచుకోవడానికి బూస్టర్ డోసును వేసేదే బూస్టర్ డోసు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఇప్పుడు బూస్టర్ డోసు ఆవశ్యకత ఏర్పడింది.
రెండు డోసులు తీసుకున్న తర్వాత 9 నెలల తర్వాత వేస్తారు .
సోమవారం నుండి ప్రారంభం అయ్యే బూస్టర్ డోసు లో మొదట హెల్త్ వర్కర్స్ కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి 60 సం. దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో భాధ పడేవారికి ఈ టీకా వేస్తారు.