ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్)పై టోల్‌ట్యాక్స్ వసూలు ద్వారా ఏడాదికి రూ. 500 కోట్ల ఆదాయం లభిస్తుందని హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అంచనా వేస్తోంది. ఆ మొత్తం కంటే ఎక్కువకు టెండర్లు కోట్ చేసిన సంస్థకే టోల్ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. ముంబైకి చెందిన కొన్ని సంస్థలు ఓఆర్‌ఆర్ టోల్‌పై ఆసక్తి చూపుతున్నాయని తెలిసింది. ఇప్పటికే దిగ్గజ సంస్థలు ఓఆర్‌ఆర్ టోల్ కోసం బిడ్లు వేశాయి. అధికారులు సోమవారం టెండర్లను ఓపెన్ చేయనున్నారు. టెక్నికల్ బిడ్లను పరిశీలించి.. అర్హత ఉన్న సంస్థలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అత్యధికంగా కోట్ చేసిన సంస్థకు టోల్ వసూళ్ల బాధ్యతలను అప్పగించేందుకు వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఈగల్ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ బాధ్యతలు చూస్తుండగా.. ఆ సంస్థ టెండర్ గత ఏడాది సెప్టెంబరుతో ముగిసింది.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more