తొలిపలుకు న్యూస్ (ఖైరతాబాద్) : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసరప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రకు ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more