మాదాపూర్ : నేడు మన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీ అధినేత,గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.కేసీఆర్, సగర్వంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా యావత్ తెలంగాణ సమాజానికి,టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు,ప్రభుత్వ విప్ గాంధీ ,మాదాపూర్/హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్లు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్…ఎమ్మెల్యే కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని,టిఆర్ఎస్ జెండా అన్ని వర్గాల ప్రజలందరికీ అండాదండగా నిలుస్తోందన్నారు…
గురువారం టిఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో, ఓల్డ్ హఫీజ్ పేట్ లకలిప్స్కో హోటల్ నందు మరియు హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా కమిటి మెంబర్లు,బూత్ కమిటిమెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు ,మహిళలు, నాయకులు,కార్యకర్తలతో కలిసి టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.