నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా నీయమితులైన శ్రీమతి సూదం లక్ష్మీ రవి చందర్ గారికి ఆత్మీయ సన్మానం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మరియు నగర మున్నూరుకాపు సంఘం సభ్యులు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలంగాణ మహిళ కమిషన్ సభ్యురాలిగా నీయమితులైన శ్రీమతి సూదం లక్ష్మీ రవి చందర్ గారికి నగరంలో ని నిఖిల్ సాయి హోటల్ లో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం లోని అన్ని సంఘాల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ…
◆తెలంగాణ మహిళ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన సూదం లక్ష్మీ రవి చందర్ గారికి శుభాకాంక్షలు.
◆సూదం లక్ష్మీ రవి చందర్ గారు మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.వివిధ వేదికలపై వారి గళాన్ని వినిపించాలని కోరుతున్నాను.
◆మున్నూరుకాపు సోదర సోదరిమణులకి అన్ని కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తున్నాము.
◆నగరంలో ని అన్ని మున్నూరుకాపు సంఘాలకు గతంలోనే 5 లక్షల రూపాయలు మాంజరు చేయడం జరిగింది.
◆మున్నూరుకాపు స్మశాన వాటికని కూడా నిధులు మంజూరు చేసి నిర్మిస్తున్నాము.
◆మున్నూరుకాపు సంఘం కొరకు 1 కోటి రూపాయలు మున్నూరు కాపు హాస్టల్ భవనానికి 1 కోటి రూపాయలు ఇది వరకే నిదులు మంజూరు చేసాము. మున్నూరుకాపు సంఘం పెద్దలు సంఘం మరియు హాస్టల్ నిర్మాణము కొరకు ముందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను.
◆ప్రస్తుతం ఉన్న ప్రతీ సంఘాలకు కూడా 5 లక్షల నిధులు మంజూరు చేస్తానని తెలియచేస్తున్నాను.
◆మున్నూరు కాపు సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియచేస్తున్నాను.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి నీతూ కిరణ్,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్,ఆకుల లలిత , ఆకుల సుజాత, దారం సాయిలు, ముచుకుర్ లావణ్య నవీన్ , న్యాలం కిషన్ మరియు మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.