- షేక్ రహమతుల్లా మైనారిటీ మోర్చా కోశాధికారి-బిజెపిపార్టీ
- ఆలిండియా స్పోక్స్ పర్సన్
హైదరాబాద్ : ఈరోజు 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని, బేగంబజార్ డివిజన్లో డాక్టర్ సిద్దిక్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా కోశాధికారి షేక్ రహమతుల్లా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా షేక్ రహంతుల్లా మాట్లాడుతూ…
75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సమస్యలను అధిగమించి భారతదేశం ప్రగతి దిశగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ రోజు అని తెలియజేశారు. అదేవిధంగా కరోనా అనే మహమ్మారిని సమస్యను అధిగమించి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూన్నను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు బిజెపి పార్టీ జాతీయ నాయకులుతదితరులు పాల్గొన్నారు.