చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ…
దేశంలో పార్టీలకు అతీతంగా 120 మంది ఎంపీ ఉభయ సభలను పక్షం రోజులు బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని, లేనియెడల కేంద్ర మంత్రులను, ఎంపీలను రాష్ట్ర రాజకీయ నేతలను ఎక్కడికక్కడ ముట్టడి చెయ్యాలన్నారు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలకు అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏం చెయ్యకపోతే ఎలా అని కుమారస్వామి ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కుమారస్వామి కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు పెట్టినట్లుగానే, బీసీల కోసం ప్రత్యేక బీసీ బంధు ఏర్పాటు చేసి, పేద ప్రజలైన బీసీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము బీసీలపై చిన్నచూపు చూస్తుందని, దేశంలో బీసీల సంఖ్య దాదాపుగా 60% శాతం పైగా ఉందని, అలాంటి బీసీలకు సరైన న్యాయం చేయని యెడల, బీసీ దళ్ తరపున ప్రజలను ఉత్తేజపరిచి కేంద్ర ప్రభుత్వాలపై తిరగ బడతామని దుండ్ర కుమారస్వామి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుందర్ కల్లూరి మాట్లాడుతూ…
బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని అన్నారు. బిసిలకు పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. గౌరవ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గారి సారధ్యంలో, ఆయన పిలుపు మేరకు, తెలంగాణలోని ప్రతీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా న్యాయ పోరాటానికి బీసీలందరం సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రతీ బీసీ బిడ్డ కలిసి రావాలని సుందర్ కల్లూరి పిలుపునిచ్చారు.