హైదరాబాద్: హైదరాబాద్ ఈ-సిటీలో సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నెలకొల్పిన నూతన ప్లాంట్ ను మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎనర్జీస్ ఫౌండర్ మరియు చైర్మన్ సురేందర్ పాల్ సింగ్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి. నరసింహా రెడ్డి పాల్గొన్నారు.
రూ. 483 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ సెల్స్ మరియు సోలార్ మాడ్యుల్స్ ను తయారు చేస్తారు.