- సొంతగూటికి చేరిన ఘట్కేసర్ మండల పాత కాంగ్రెస్ నేతలు
- టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
ఘట్కేసర్: ఘట్కేసర్ మండలంలోని ఆయా గ్రామాల పాత కాంగ్రెస్ నాయకులు కారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. చౌదరిగూడ, కొర్రెముల గ్రామాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ కు రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు నందికంటి శీధర్ టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ పాలడుగు అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఘట్కేసర్ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో వీరంతా నగరంలోని రేవంత్ రెడ్డి నివాసానికి తరలి వెళ్లి ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కారు పార్టీ వీడి హస్తం గూటికి చేరిన వారిలో కొర్రెముల గ్రామ మాజీ ఉప సర్పంచులు పల్లె బాబురావు గౌడ్, జి. భాస్కర్, వార్డు సభ్యులు జువ్వ స్వామి, మాజీ వార్డు సభ్యులు, టీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు గోపు లక్ష్మయ్య యాదవ్, కొప్పుల యాదగిరి, కప్పర భాస్కర్ గౌడ్, నాయకులు రాధారం కృష్ణ, వీరగోని వెంకటేష్, తంతర పల్లి యాదగిరి, కప్పర శ్రీనివాస్, నాయకులు గోపు ఐలయ్య, రాధారం బాలనర్సింహ్మ, కేసాని సత్తయ్య యాదవ్, మక్సూద్, అక్రమ్, ముజాయిద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చౌదరిగూడ, కొర్రెముల గ్రామ శాఖల అధ్యక్షులు అనిల్ గౌడ్, బీస అంజనేయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.