మల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మల్లాపూర్ డివిజన్ పరిధిలో, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, గోకుల్ నగర్ తో పాటు వివిధ కాలనీలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు కోటేశ్వరరావు రూపా, వేణుతో పాటు స్థానిక టిఆర్ఎస్ నాయకులు స్థానిక కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు