బాగ్ లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, ముషీరాబాద్ నియోజకవర్గ, రాంనగర్ డివిజన్ పరిధిలోని, బాగలింగంపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతీ శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
సామాజిక వేత్త, హనుమత్ దాసుడు అయినటువంటి రవికాంత్ (చిన్నా) దాతగా, గడ్డం సతీష్ కుమార్ సహకారంతో, బాగలింగంపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతీ శనివారం అన్నదానా కార్యక్రమం చేపట్టి, వందలాది మందికి కడుపునింపే కార్యక్రమం నిర్వహిస్తున్నారు..
ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ..
కలియుగ దైవం అయినటువంటి ఆ హనుమంతుని సన్నిధిలో సేవచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. నాకు కలిగినంతలో ప్రతీ శనివారం 200 మందికి ఆకలి తీర్చగలుగుతున్నాను, నా జీవితంలో ఇంతకన్నా మించిన తృప్తి ఇంకోటి లేదు అని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ సేవకుడు గడ్డం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రవికాంత్ అన్నని, ఆ హనుమంతుడు చల్లగా చూడాలని, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేసేంత శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుందర్, కేశవ్, శివ కుమార్, యాదగిరి, చంటి మొదలగు వారందరికీ పేరు పేరునా గడ్డం సతీష్ ధన్యవాదాలు తెలియజేశారు..