పెద్దపల్లి: జూలపల్లి మండలం కాచపూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గరవెందుల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయన్ని అందించారు. మనోహర్ రెడ్డి చేసిన సాయానికి గరవెందుల శ్రీనివాస్ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంటు ఎల్లయ్య , ఉపసర్పంచ్ గండు మల్లారెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు నారగోని శంకరయ్య, తెరాస మండల్ యూత్ సెక్రటరీ నారగోని శివకుమార్ గౌడ్, బాలసాని సాగర్ గౌడ్ గరవెందుల వెంకటేష్ , బత్తిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.