రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయాన్ని మరియు లింగన్నపేట్ వాగును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే IPS గారు సందర్శించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు .
అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రోడ్లు తెగిపోయిన చోట, నీరు ఎక్కువగా ప్రవహించే చోట్లకు ప్రజలు రాకుండా అప్రమత్తతా సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట సి.ఐ మోగిలి, ఎస్.ఐ సౌమ్య ప్రొహిబిషనరీ, ఎస్.ఐ రమేష్ ఉన్నారు సిబ్బంది ఉన్నారు.