కుకట్ పల్లి : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ లో ఈ రోజు కూకట్పల్లి ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు , డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ , మరియు DE ఆనంద్, AE రంజిత్, మరియు GHMC అధికారులతో కలిసిసుమారు 80 లక్షల వ్యయంతో, జ్యోతి నగర్, సెర్వే NO:18 , మరియు రాజీవ్ గాంధీ నగర్ లలో పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయం లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం ఈ యొక్క ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మరియు మంత్రి వర్యులు కే టి రామారావు వల్లనే సాధ్యం అని అన్నారు. అలాగే కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ ఇంతగా ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం అంటే దానికి ఎమ్యెల్యే గారి యొక్క చొరవ వలెనే ఇది అంత సాధ్యం, ఈ రోజున పలు బస్తి ల్లో సుమారు 80 లక్షల వ్యయంతో కూడిన కార్యక్రమాలకు శంకుస్థాపన జరగడం నిజంగా గర్వించతగ్గ విషయం, ఇంత గా సహకరిస్తూ మమల్ని ముందుకు నడిపిస్తున్న ఎమ్యెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రెసిడెంట్ లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరా రెడ్డి, పలు బస్తి అధ్యక్షులు, అనుబంధ కమిటీ సభ్యులు,ఏరియా సభ సభ్యులు,మహిళా కార్యకర్తలు,మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.