గోల్నాక: హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ న్యూకృష్ణ నగర్ మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అప్రమత్తం చేసారు. బయపడకండి మీకు నేనున్నాను అని వారికి మనోధైర్యం చెప్పారు.
మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా తమకు తెలియజేస్తే తక్షణమే ఇక్కడికి చేరుకుంటామని ఆమె భరోస ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, బాలరాజ్, శేషు, నర్సింగ్ యాదవ్, యూసుఫ్, రాజు,ఉమేష్,ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.