ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో బొగ్గు తవ్వకం, రవాణా ద్వారా పొల్యూషన్, రోడ్లు పాడవడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈనేపథ్యంలో సింగరేణి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏర్పాటు చేసిన ‘డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్’ (డి.ఎం.ఎఫ్.టి) నిధులను ఇక నుంచి ఉమ్మడి జిల్లాకు కాకుండా ఇటీవల రాష్ట్రపతి ఆమోదించిన జిల్లాల వారిగానే కేటాయించబడుతాయని సీఎం తెలిపారు. తెలంగాణలో జిల్లాలు అంటే నోటిఫై చేసిన 33 జిల్లాలుగానే భావించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, ఆయా జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకే డి.ఎం.ఎఫ్.టి నిధులు కేటాయిస్తామని సీఎం అన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more