హైదరాబాద్ : రాయదుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు.
మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఆర్థిక సేవల కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ కంపెనీలో ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021 చివరి నాటికి 800 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి గుంజన్ సమతాని తెలిపారు.