అంబర్ పెట్: అంబర్ పెట్ నియోజకవర్గ అన్నపూర్ణ నగర్ లాల్ బాగ్ లో గవర్నమెంట్ కోటర్స్ తదితర ప్రాంతాల్లో ప్రజా సమస్యలు కొన్నిచోట్ల కరెంట్ పోల్స్ ఐరన్ ని తీసి సిమెంట్ పోల్స్ పెట్టమని, ఐరన్ పోల్ దానివల్ల కరెంటు షాక్ వస్తున్నాయని, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు, స్ట్రీట్ లైట్స్, కొన్ని చోట్ల రోడ్డు ప్యాచ్ వర్క్ తదితర అంశాలను స్థానిక ప్రజలు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ సమస్యలన్నిటినీ సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం మరియు అధికారులు సహకారంతో అతి తొందరలో పరిష్కరిస్తామని ప్రజలకు లావణ్యశ్రీనివాస్ గౌడ్ హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వేణు గోపాల్, డి ఈ సుధాకర్, వాటర్ మేనేజర్ రోహిత్ గారు వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, జిహెచ్ఎంసి ఎస్ ఎఫ్ ఎ లు మరియు మలేరియా ఎస్ ఎఫ్ ఏ, వాటర్ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, స్ట్రీట్ లైట్స్ అధికారులు, పారిశుద్ధ కార్మికులు, స్థానిక బస్తి పెద్దలు నరసయ్య , ప్రసాద్, కే శ్రీనివాస్, గఫూర్, లక్ష్మణ్ మరియు టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ఆర్ కె బాబు, నర్సింగ్ యాదవ్, రేడ్డపాక రాము, రాజు, ఉమేష్, శ్రావణ్, సతీష్ , రాజేష్, రాము, ప్రణీత్, మహిళా సోదరీ సోదరీమణులు సుమతి, వసంత, ధనలక్ష్మి, మనోహర, రేణుక, యువత తదితరులు పాల్గొనడం జరిగింది.