సిద్ధిపేట: తెలంగాణ జిల్లా, సిద్ధిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో శనివారం వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని, గ్రామ పంచాయతీ నర్సరీని, గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో స్టీల్ బ్యాంకును, ఓపెన్ జిమ్, స్మశాన వాటిక, రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..
రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు అని ఉద్ఘాటించారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు ఎక్కడలేదన్నారు. సిద్ధిపేట పట్టణీకరణ భవిష్యత్ పొన్నాల వైపు ఉన్నదని, కొత్త కలెక్టరేట్, రైల్వే లైను మీదుగా పోవడంతో శరవేగంగా పొన్నాల పట్టణాభివృద్ధి జరుగుతున్నది అని తెలిపారు
-పొన్నాల టూ గుడికందుల వరకు పొన్నాల రాజీవ్ రహదారి మీదుగా కిష్టసాగర్, ఏన్సాన్ పల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్ మీదుగా గుడికందుల వరకూ డబుల్ రోడ్డు నిర్మాణం ఉంటుందని, అందుకు అవసరమైన రూ.14.16 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.