ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మాదారం గ్రామంలో గ్రామ యువత ఎం పి ఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన సందర్భంగా వైయస్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీదగా మొదటి బహుమతి సహస్ టీంకి, రెండో బహుమతి రెడ్ బుల్ టీంకి, ఎం పి పి ఏనుగు సుదర్శన్ రెడ్డి తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదగిరి,ఎంపీటీసీ శోభా దామోదర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు ఘట్కేసర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కందుల కుమార్ మండల జనరల్ సెక్రటరీ నాగరాజ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ శ్రీవిద్య హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ నాయకులు బసవరాజ్ రాజు వేణు రవి మరియు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more