- ఢిల్లీలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి..
- అందరి అంచనాలను తిప్పికొట్టిన యంగ్ ఎంపీ.
- అలిగిన పెద్దలను బుజ్జగించే పనిలో బిజీ బిజీ.
తెలంగాణ: కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించారు. ఆ అధ్యక్ష పదవి కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి, ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎప్పట్నుంచో ఈ అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారాలు, ప్రయత్నాలు, ఊహాగానాలు ఎట్టకేలకు అధిష్టానం రేవంత్ రెడ్డిని ఖరారు చేసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని అన్నారు. అమర వీరుల ఆశయాల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు పని చేస్తానని, తన మీద నమ్మకంతో ఈ బాధ్యతని తనకిచ్చినందుకు రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీలో నిన్న, మొన్నటి వరకు అభిప్రాయ బేధాలు ఉన్నవారిని కూడా కలుపుకుపోతామని, వారితో కలిసి మాట్లాడుతానని, సీనియర్ నాయకులందరిని కలుస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మా కుటుంబం అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి లాంటి వాళ్లతో చర్చించి మంచి కార్యచరణతో రాబోయే కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని తెలియజేశారు.