యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి జిల్లాలో, అడ్డ గూడూరు మండలంలో ఇటీవల జూన్18 వ తేదీన జరిగిన లాకప్ డెత్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం వివిధ ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా జాతీయ కన్వీనర్ POW ప్రెసిడెంట్ సంధ్య, A.k.G.S రాష్ట్ర నాయకులు మామిడాల బిక్షపతి, కామ్రేడ్ అనురాధ, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మామిడి కాయల పరశురాములు నిర్ధారణ కమిటీ గా ఏర్పడి, 24 గురువారం ఉదయం 11 గంటలకు అడ్డగూడూరు మండలం చేరుకోవడం జరిగింది.
ఇటీవలే మరణించిన మరియమ్మ మరణం గూర్చి పూర్తి వివరాలు సేకరించడంలో ప్రజా సంఘాలు పూర్తిగా సఫలమయ్యారు అని ప్రజా సంఘాల నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధితులకు కఠిన శిక్ష వేయాలని నినాదాలతో హోరెత్తించారు.
ఆ తరువాత మరియమ్మ పని చేసిన, చర్చి ఫాదర్ బాలశౌరి నివసిస్తున్న గోవిందపురం గ్రామానికి చేరుకొని ఆమె నివసించిన ఇంటిని పూర్తిగా పరిశీలించారు. తరువాత POW జాతీయ కన్వీనర్ సంధ్య బాలశౌరి మీద తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. 16 వ తారీఖున ఖమ్మం జిల్లా చింతకాని పోలీస్ స్టేషన్ కు పోవడానికి పోలీసులు బాలశౌరి వాహనాన్ని వాడుకోవడానికి గల కారణాన్ని బాగా పరిశీలిస్తే, పూర్తిగా ఇతనే దానికి బాధ్యతగా కనిపిస్తుంది అనే అనుమానం వ్యక్తం చేశారు. మరుసటి రోజు 17 తేదీన మేము పోవడానికి పెద్ద వాహనం కావాలి అని పోలీసు వాళ్ళు చర్చి ఫాదర్ ని మరొక్కసారి సంప్రదించడంతో TS 309z63 నెంబర్ బొలేరో వాహనాన్ని చర్చి ఫాదర్ సమకూర్చడం జరిగింది.
అడ్డగూడూర్ ఎస్ఐ మహేష్ 18 వ తేదీన ఉదయం 10:30 కి బాలశౌరిని, మరియమ్మకు బాగాలేదు తొందరగా భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కి రమ్మని పిలిచాడు. కొద్ది క్షణాలలోనే పత్రికా విలేకరులు బాలశౌరిని సంప్రదించి, మరియమ్మ చనిపోయిన విషయం మీకు తెలుసా అని ప్రశ్నించగా, నాకు తెలవదు, మరియమ్మ ఎక్కడ అని చూడగా మార్చురీలో కనిపించింది అని బాలశౌరి భయం భయంగా సమాధానం చెప్పాడు.
పోలీసు వాళ్ళు మరియమ్మ కుమారున్ని మరియు తన మిత్రుడు వద్దనుండి 60 వేల రూపాయలు రికవరీ చేసినట్టు, అలాగే ఒక ఫోన్ ని రికవరీ చేసుకున్నట్టు పోలీసులు తనతో చెప్పినట్లు బాలశౌరి చెప్పాడు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి కమిటీ సభ్యులు, వెంటనే అతనిపై కేసు పెట్టి సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల నాయకులు POW జాతీయ కన్వీనర్ A.K.G.S రాష్ట్ర నాయకులు మామిడాల బిక్షపతి, కామ్రేడ్ అనురాధ, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మామిడి కాయల పరుశరాములు పాల్గొన్నారు.