ఘట్కేసర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో జలమండలి అధికారులు ప్రజా ప్రతినిధులతో, మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు ఘట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలలో మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి ఇవ్వకపోవడంపై సంవత్సర కాలంగా పలుమార్లు సమావేశాలు పెట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏటువంటి ప్రయోజనం లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. చౌదరిగూడా గ్రామంలో 3000 పైగా ఇళ్లకు మంచి నీటి కనెక్షన్ ఇవ్వలేదు, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పిన అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు.
గ్రామపంచాయతీ పాలకవర్గాలు తీర్మానాలు చేసి పంపినా కూడా పట్టించుకోవడం లేదు,ఇట్టి విషయంపై మంత్రి చామకూర మల్లారెడ్డికి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ రెడ్డి, జల మండలి డి ఈ కార్తీక్ రెడ్డి,వైస్ ఎంపీపీ కర్రీ జంగమ్మ,గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.