మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా లో శనివారం రోజున పేద కుటుంబానికి చెందిన మంజుల కుమార్తె వివాహానికి పుస్తే మట్టెలు శ్రీ రామానుజ యజ్ఞంక పీఠం అధ్యక్షులు శ్రీమాన్ గోవర్ధన విద్యుల్లత ప్రవీణ్ కుమారా చార్య స్వామి దంపతులు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో పేద కుటుంబానికి చెందిన వ్యక్తులను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ శ్రీ రామానుజ పీఠం అందుబాటులో ఉంటుందని శనివారం రోజున స్థానికుల సమాచారంతో పేద కుటుంబానికి చెందిన మంజుల యొక్క కుమార్తె వివాహానికి పుస్తె మట్టెలు అందించడం జరిగిందని తెలిపారు. శ్రీమన్నారాయణ ఆశీస్సులతో నూతన వధూవరుల జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రామానుజ పీఠం అధ్యక్షులు ఆశీర్వదించారు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more