అనారోగ్య బాధితుడి ఇంటివద్దే భూ రిజిస్ట్రేషన్..పాస్ బుక్ అందజేత
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్ (35) అనే గీత కార్మికుడు తన తల్లి భారతమ్మ పేరిట ఉన్న భూమిని వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 6నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకోగా జామబంది జరగకపోవడంతో, రాజశేఖర్ ప్రమాదవశాత్తు గత 6 నెలల క్రితం తాటిచేట్టు పైనుండి పడి, తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాళ్లు చేతులు కూడా చతికిల పడిపోయి మంచానికి పరిమితం అయ్యాడు
దీంతో తాహసిల్దార్ కార్యాలయం కి వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ మూటెషన్ చేయించుకొనే పరిస్థితి లేకపోవడంతో విషయం తెలుసుకున్న చందుర్తి తాసిల్దార్ ధర్పల్లి నరేష్, శనివారం బండపల్లి గ్రామానికి వెళ్లి తన తల్లి పేరిట ఉన్న 3 ఎకరాల 6 గుంటల వ్యవసాయ భూమిని మూటెషన్ చేశారు, దీంతో రాజశేఖర్ కు సంబంధించిన పట్టాదార్ పాస్ బుక్ కాపీని తాసిల్దార్ ఇంటి వద్దనే రాజశేఖర్ కు అందజేశారు.
గ్రామస్తుల కోరికమేరకు తహసీల్దార్ నరేష్ బండపల్లి గ్రామానికి వచ్చి బాధితునికి ఇంటివద్దనే మ్యూటెషన్ చేసి పాస్ బుక్ కాపీని అందజేయడం పట్లు తాసిల్దార్ ను గ్రామస్తులు అభినందించారు, ఈ సందర్భంగా తాసిల్దార్ నరేష్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటూ కార్యాలయానికి వచ్చే పరిస్థితి లేనివారికి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ధరణి ఆపరేటర్ మార్త సాయి పాల్గొన్నారు.