హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయానికి రామంతపూర్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ… GHMC పరిధిలోని అన్ని నాళాలను, చెరువులను పూడికతీత పనులు ప్రారంభించాలని, అపరిష్కృతంగా ఉన్నటువంటి నాలాలపై వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు .గత సంవత్సరం భారీవర్షాల వలన హైదరాబాద్ అతలాకుతలమైంది, పేద ప్రజల ఇల్లు నేలమట్టం కావడం జరిగింది, అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కళ్ళు తెరిచి నాళాలు బాగు చేయాలని అదేవిధంగా, కాల్వల మరమ్మతు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని, డిమాండ్ చేశారు.
గత సంవత్సరం వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు మరియు వర్షపు నీటి కాలువలను బాగు చేయాలని కోరారు. ధర్నాకు తరలి వెళ్లిన వారిలో హబ్సిగూడ కార్పొరేటర్ శ్రీమతి చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు, రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు”, రాష్ట్ర బిజెపి ఓబిసి అధికార ప్రతినిధి వేములకొండ సోమ శేఖర్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు న్యాల కొండ సుమన్ రావు, సంజయ్ పటేల్, కుమారస్వామి, రేవు నరసింహ, పాశం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు