రామంతపూర్: రానున్న వర్షం కాలం దృష్టిలో పెట్టుకొని రామంతపూర్ చిన్న చెరువు , పెద్ద చెరువు లను సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారితో కలిసి చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించి చెరువుల సుందరీకరణ ,వాటిపైన వాకింగ్ ట్రాక్ ఏర్పాట్లు చిన్న చెరువులో వద్ద ఉన్న డంపింగ్ యార్డ్, నాలను అనుకోని ఉన్న కాలనీల యూ జి డి సమస్యలు పరిశీలించడం జరిగింది .
ఈ యొక్క సమస్యలు తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అధికారులు స్పందించి సమస్యలను త్వరలోనే పూర్తి చేశామని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ మునిసిపల్ సర్కిల్ కమిషనర్ అరుణ, హబ్సిగూడ కార్పొరేటర్ శ్రీమతి చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, ఉప్పల్ మునిసిపల్ సర్కిల్ ఈ. ఈ. నాగేందర్ ,డి .ఈ. నాగమణి , ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈ పవన్ , ఏసీపీ శ్రావణి , .డి.ఈ ఎస్ .డబ్ల్యూ. చందన ,ఏ .ఈ లు కీర్తి ,విఘ్నేశ్వరీ, పృథ్వి మీర్పేట్ హెచ్ .బి. కాలనీ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ ,టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్ గుండరపు శ్రీనివాస్ రెడ్డి ,నంది కంటి శివ, సోమిరెడ్డి ,మహేందర్ డీజే సాయి తదితరులు పాల్గొన్నారు.