పంజాబ్‌లోని ప్రతి ఇల్లుకూ జులై 1వ తారీఖు నుండి నెలకు 300 యూనిట్ల దాకా ఫ్రీగా విద్యుత్ పంపిణీ జరుగుతుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ ప్రకటనపై కేజ్రీవాల్ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశాడు.
“మేము మిగిలిన పార్టీల్లాగా నకిలీ హామీలు ఇవ్వబోము. పంజాబ్ లో అవినీతిని నియంత్రించడం ద్వారా పంజాబ్ ప్రభుత్వం డబ్బును ఆదా చేస్తుంది, ఆ విధంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్తుంది” అని ఆయన చెప్పారు.
ప్రజలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలనే భగవంత్ మాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన అభినందిస్తున్నట్లు చెప్పారు. పంజాబ్‌లో ఒక స్పష్టమైన ఉద్దేశంతో దేశభక్తి, నిజాయతీ కలిగిన ప్రభుత్వం నిర్మించబడింది. రాష్ట్రాన్ని ప్రగతి దిశలో నడిపించేందుకు నిధుల కొరత ఉండబోనివ్వమని తెలిపారు.